తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల, కందుకూరులో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పసుపులేటి మురళి గారు మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోలిశెట్టి గీతా శ్రీనివాసరావు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియలో యువత, ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని వారు వివరించారు.SVEEP కార్యక్రమం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటర్ల నమోదు, ఎన్నికల్లో బాధ్యతాయుతంగా ఓటు వేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి బాధ్యత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ఇతరులకు కూడా ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.