రూ.38 వేల విలువైన Realme, OPPO మొబైళ్లను గుర్తించి బాధితులకు అప్పగింత – దొనకొండ పోలీసుల చాకచక్యమైన చర్య
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్లను దొనకొండ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి గుర్తించి రికవరీ చేశారు. దొనకొండ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.రికవరీ చేసిన మొబైల్ ఫోన్లలో రూ.20,000 విలువైన Realme మొబైల్ ఫోన్, రూ.18,000 విలువైన OPPO మొబైల్ ఫోన్ ఉన్నాయి. మొత్తం రూ.38,000 విలువైన రెండు మొబైల్ ఫోన్లను సరైన ధృవీకరణ ప్రక్రియ అనంతరం సంబంధిత బాధితులకు పోలీసుల సమక్షంలో అప్పగించారు.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దొనకొండ పోలీసులు చేపట్టిన చర్యలు అభినందనీయం.
ప్రజలు తమ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.