తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభం మండలం పెద్ద నల్లకాల్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.7000 విలువ గల ఆఫీస్ టేబుల్ ను లయన్స్ క్లబ్ సభ్యుడు, గణేష్ ఫర్నిచర్ & ఎలక్ట్రానిక్స్ యజమాని జూలూరి శ్రీకాంత్ తన తండ్రి కీ. శే. గణేష్ రావు జ్ఞాపకార్ధం బహుకరించడం జరిగింది…పెద్ద నల్లకాల్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, పత్తి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల సమక్షంలో టేబుల్ ను అందజేయడం జరిగింది…ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో కూడా ఈ పాఠశాలలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దాత శ్రీకాంత్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు సెల్ ఫోన్ పేర్లి గుండయ్య, కార్యదర్శి లాయర్ మొఘల్ మహబూబ్ బేగ్, లింగం రాజేంద్ర మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు…