ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లో జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లోని విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల 10వ తేదీన వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతో ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సేవా సమితి తరఫున నిరుపేద విద్యార్థులకు నోట్‌బుక్లు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పెనర్లు వంటి విద్యా సామగ్రితో పాటు బిస్కెట్ ప్యాకెట్లను కూడా అందించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవను చేపట్టినట్లు తెలిపారు.తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం ఎంతో కష్టపడుతున్నారని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, చరణ్ తేజ, వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *