ఉలవపాడు మండలం భీమవరం గ్రామంలోని జెడ్ పి హెచ్ యస్ ప్రభుత్వం పాఠశాల నందు ప్రధానోపాధ్యాలు సార్ గారు శ్రీ బి, సుబ్బారావు గారి సహకారంతో ఇన్చార్జి ప్రధానోపాధ్యాలు శ్రీ ఎస్, వి , శివరావు గారి అధ్యక్షతన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు ప్రకాశం జిల్లా దిశ వారి ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ వారి అధ్యర్యంలో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , సిఫిలిస్, హెపటైటిస్ బి, క్షయ వ్యాధి, మరియు సుఖ వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాలు శివరావు సార్ గారు మాట్లాడుచు హెచ్ ఐ వి, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎవ్వరకూడ ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసినారు స్థానిక లింక్ వర్కర్ వీరమల్లు రవీంద్ర మాట్లాడుచు హెచ్ ఐ వి వైరస్ ఒకరి నుంచి మరొకరుకు నాలుగు మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుందని అవి
1 సురక్షిత లైంగిక సంబంధాలు
2 కలుషితమైన సూదులు, సిరంజిలు
3కలుషితమైన రక్త మార్పిడి
4 హెచ్, ఐ, వి జీవిస్తున్నారు తల్లి గర్భవతి అయితే ఆమెకు పుట్టబోవు బిడ్డకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదు అని అంటినుకొను వ్యాధి అని, ఎయిడ్స్ కి మందు లేదు అని నివారణ ఒక్కటే మార్గం అని, ఆ నివారించగలిగినదే కండోమ్ అని, ఎయిడ్స్ తో జీవిస్తున్న వారికి ప్రభుత్వం వారు ప్రతి నెలా ఉచితంగా ఏ, ఆర్, టి మందులు పంపిణీ చేస్తున్నారు అని, క్షయ వ్యాధి పట్ల, సుఖ వ్యాధులు పట్ల అవగాహన కలిగి ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో చాకిచెర్ల పి హెచ్ సి, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రఘునాథ్ బాబు, స్కూల్ టీచర్స్ యం, భాస్కర్, పి డి సార్, సుబ్బారావు , మస్తాన్, ఏ యన్ యం, యం ఎల్ హెచ్ పి, ఆశ వర్కర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *