తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు స్కూల్ మరియు కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చైల్డ్ మ్యారేజ్ , వమెన్ (trafficking),మత్తుపదార్థాలు, ఆన్‌లైన్ మోసాలు మరియు సైబర్ ఫ్రాడ్ వంటి సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించబడింది.విద్యార్థులకు సోషల్ మీడియా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు, రోడ్డు ప్రమాదాల, మహిళలపై నేరాలు, ఆన్‌లైన్ లోన్ యాప్స్ మరియు బ్యాంకు మోసాలు, నిషేధిత మత్తుపదార్థాల దూరంగా ఉండాలన్నారు. పోలీసులు గంజాయి, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్, చెర్రస్ వంటి మాదకద్రవ్యాల వల్ల యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాలు మెదడు, గుండె, లివర్, ఊపిరితిత్తుల వంటి ముఖ్య అవయవాలపై దుష్ప్రభావం చూపుతాయని, వాటి వాడకం, రవాణా చట్టపరంగా కఠినంగా దండించబడుతుందని స్పష్టంచేశారు.
