తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గిద్దలూరు రూరల్ సర్కిల్ పరిధిలో సర్కిల్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిద్దలూరు రూరల్ సీఐ గారు అధ్యక్షత వహించగా, సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు హాజరయ్యారు.ఈ సమావేశంలో అన్ని యూఐ (UI) కేసులను సమగ్రంగా సమీక్షించి, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ వివరాలు, చట్టపరమైన చర్యల అమలు తీరును సీఐ పరిశీలించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ పనులు, ఫీల్డ్ లెవెల్ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై సవివరంగా చర్చించారు.సీఐ ఎస్‌ఐలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు ఇస్తూ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, నాణ్యమైన విచారణ చేపట్టి త్వరితగతిన న్యాయ పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట, విజిబుల్ పోలీసింగ్ మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.అలాగే ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన, రికార్డుల నిర్వహణలో స్పష్టత, చట్ట అమలులో కట్టుదిట్టత ఉండాలని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *