తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో నిర్వహించిన తెప్పోత్సవం సందర్భంగా శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా Prakasam District Police ప్రత్యేక బందోబస్తు (B/B) ఏర్పాట్లు చేపట్టారు.ఈ సందర్భంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ పరిధిలో డ్రోన్ నిఘా ద్వారా ప్రదేశాన్ని పర్యవేక్షిస్తూ గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అనుకోని ఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఉత్సవం సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
