తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని మార్కాపురం – తర్లుపాడు రోడ్డులో సాయి బాలాజీ పాఠశాల ఎదుట ఈ నెల 25వ తేదీన జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఐఏఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ , జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాసరావు , ఎస్‌ఎస్‌జీ అదనపు ఎస్పీ S.V.రమణ మరియు ఇతర అధికారులు కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి సమీక్షించారు.ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్‌ను పరిశీలించి, బందోబస్తు మరియు భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, సభా ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశించారు.అనంతరం ఈనెల 25వ తేదీన దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావానిపల్లిలోని ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రదేశం,వీఐపీల వాహనాల రాక, పార్కింగ్‌ ఏరియా మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ సూచించారు.అనంతరం దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావానిపల్లిలోని ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,,SSG అడిషనల్ ఎస్పీ S.V రమణ , ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్ బాబు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రదేశం, చుట్టూ బారిగేట్లు ఏర్పాట్లు, వీఐపీల వాహనాల రాక, పార్కింగ్‌ ఏరియా మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ చిరంజీవి, డిపిఓ శ్రీ వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డీఎస్పీ నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు, వై. పాలెం సిఐ అజయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *