పేద రైతు కుటుంబంలో జన్మించిన సి. ఉమాదేవి తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. గిద్దలూరు ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో( కోట గడ్డ వీధి)ఉంటూ గిద్దలూరు ప్రభుత్వ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆమె, పదో తరగతి పరీక్షల్లో 582 మార్కులు సాధించి గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంత అద్భుత ఫలితం సాధించడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా ఉమాదేవిని ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహకంగా రూ. 5000 నగదు బహుమతి అందజేశారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్, ఆయుర్వేద ఎముకల డాక్టర్.బైలడుగు బాలయ్య, మండల ఎంఈఓ-1 అశ్విని కుమార్, ఎంఈఓ-2 నాగభూషణ్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు పాల్గొని ఉమాదేవికి అభినందనలు తెలిపారు. పేదరికాన్ని జయించి ప్రతిభతో మెరిసిన ఉమాదేవి – నిజంగా అందరికీ ఆదర్శం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *