తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:-
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం పుట్టికాయగుళ్ల గ్రామంలో శ్రీ గంగాభవాని నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు తిరిగి కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కొరకు వైసిపి నాయకులు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చే భక్తుల కొరకు అన్నదానానికి సహకరించిన దాత కామూరి రమణారెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.