గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు చేపట్టారు. కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావుతో కలిసి గ్రామస్తులతో సమావేశమయ్యారు.గ్రామస్తులు బ్రిడ్జిల నిర్మాణం, రోడ్డు భద్రత, మత్స్యకారులకు ఉపాధి, ఫిషింగ్ హార్బర్, బస్సు సదుపాయాలు, ఇళ్ల స్థలాలు వంటి పలు సమస్యలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.అలాగే, పెన్షన్‌లు, భూమి సమస్యలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు వంటి అనేక అర్జీలు ఇప్పటికే పరిష్కరించబడినట్లు గ్రామస్తులు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.అలాగే, గ్రామంలోనే ఉండి ప్రజలతో మరింత సమయం గడపాలనే ఉద్దేశంతో కలెక్టర్ రాత్రి 11 గంటల వరకు గ్రామస్థులతో గడిపారు. అనంతరం, అదే గ్రామంలోని స్వర్ణ గ్రామ సచివాలయ భవనంలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *