బౌద్ధ వక్తలు.2570వ బుద్ధ పౌర్ణమి కార్యక్రమం బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో మంచి పుస్తకం షాపు ఒంగోలు నందు వైశాఖ పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య మాట్లాడుతూ బుద్ధుడు దేవుడు కాదని, బౌద్ధం మతం కాదని ప్రేమ,కరుణ,అహింస,జ్ఞానము వంటి అత్యున్నత మానవ విలువలు కలిగిని జీవన మార్గం అని తెలియజేశారు. రైతు సంఘం నాయకులు చుండూరి రంగారావు మాట్లాడుతూ నేడు పౌర సమాజం ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గం ఆనాడే‌ గౌతమ బుద్ధుడు సూచించాడని, అదే   అష్టాంగ మార్గం అని అన్నారు. అష్టాంగ మార్గం ఆచరించడం ద్వారా మనుషులందరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని మానవ మేధస్సు వికసించి దేశ అభివృద్ధికి దోహద పడుతుందని అన్నారు. ఒ.పి.డి.ఆర్ రాష్ట్ర అద్యక్షుడు చావలి సుధాకరరావు మాట్లాడుతూ పౌర సమాజంలో అసమానతలు తొలగించి జ్ఞానవంతులైన యువకులను తయారు చేయడమే బౌద్ధ ధర్మ మౌలిక సిద్ధాంతమని అన్నారు. దేశంలో మతోన్మాదం, ప్రపంచంలో యుద్ధోన్మాదం పెరగడం వలన పౌర సమాజంలో అభద్రతా భావం పెరుగుతుందని పాలకులు రాజ్యంగ స్పూర్తితో పౌరులందరికీ సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కందుకూరు దమ్మచక్ర ఫౌండేషన్ వ్యవస్తాపకులు ఉపాసక గాండ్ల హరిప్రసాదరావు మాట్లాడుతూ బౌద్ధం అహింసనూ, సర్వమానవ సమానత్వాన్ని, జ్ఞానాన్ని బోధించి భారత దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిందని, సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ రాజనీతితో పరిపాలన చేసి ప్రపంచంలోనే అత్యున్నత చక్రవర్తిగా చరిత్రకెక్కారని గుర్తు చేశారు. ప్రపంచ మమేధావి, నవభారత రాజ్యంగ నిర్మాత, నవబుద్ధుడు డా.అంబేద్కర్ తన గురువు గౌతమ బుద్ధుడేనని స్వయంగా ప్రకటించడం గర్వకారణం అని అన్నారు. గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం, మహా పరినిర్వాణం వైశాఖ పౌర్ణమి రోజున సంభవించడం వలన ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ అనుయాయులు ఈరోజును అత్యంత పవిత్రమైనదిగా భావించి గౌతమ బుద్ధునికి కృతజ్ఞతలు తెలుపుతూ బుద్ధ వందనం, ధర్మ వందనం, సంఘ వందనం చేసి పంచశీల ప్రతిజ్ఞ చేస్తారని అన్నారు. ఘనమైన చరిత్ర ఉన్న భారత ముద్దు బిడ్డ జగత్ గురువు తధాగత గౌతమ బుద్ధుని గౌరవార్ధం బుద్ధ పూర్ణిమ రోజును జాతీయ పర్వదినంగా భావించి ప్రభుత్వ శలవు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫోర్సు రాష్ట్ర అద్యక్షుడు సి.హెచ్.సుధీర్, ఎఐబిఎస్పి నాయకులు టి.వెంకటస్వామి, కెవిపిఎస్ నాయకులు జార్జి, గ్రామ సర్పంచుల సంఘం నాయకులు బి.వి.చారి, విశ్రాంత డిప్యూటీ తహసిల్దార్ ఎ లక్మి ప్రసాదు,బౌద్ధ కవి జె.మోహన్, అప్పారావు, అభ్యుదయ కవి కె.కళ్యాణ్, వి ఆర్ ఎ సుబ్బారావు, షేక్ మహబూబ్ బాషా, వెంకటరావు, పి.మోహనరావు, ఏడుకొండలు, బి.వెంకటేశ్వర్లు, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *