ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన పలువురు పాత ముద్దాయిలకు శనివారం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ సందర్భంగా గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చట్టపరమైన పరిణామాలు, కుటుంబం మరియు సామాజిక జీవనంపై ప్రభావాలను టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సి.ఐ.బీమా నాయక్ గారు వివరించారు. ఈ సందర్భంగా హాజరైన ముద్దాయిల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులు సూచించారు.ఇలాంటి కార్యకలాపాలను అణచివేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం లేదా విక్రయం చేపడుతున్నట్లు గమనించినట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 ద్వారా సమాచారం అందించాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై చెంచయ్య, ఏ.ఎస్.ఐ. మహబూబ్ భాష మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *