తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో, ప్రతిభ చూపిన కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందించారు.సోమవారం TDP కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో… విద్యార్థులు జ్ఞాన అన్షు (595), సుప్రీత (595), సేవిత్ (594), మంజునాథ్ రెడ్డి (593) లను నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మెగోమి, ఆర్ ఐ అనిల్, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, డీన్ బ్రహ్మయ్య, సి బ్యాచ్ ఇంచార్జ్ శివయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.