ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను పోలీస్ అధికారులకు సమర్పించారు. వారు తమ సమస్యలను వివరంగా తెలియజేశారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి సమస్యల నేపథ్యాన్ని తెలుసుకున్నారు మరియు వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి, చట్టం ప్రకారం వేగంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు.
అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్,త్రిపురాంతకం సిఐ అస్సన్ , పామూరు సీఐ వినోద్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *