సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు హాజరయ్యారు.సభలో ప్రసంగించిన ఆయన, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే తాను కందుకూరు, ఒంగోలు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.కార్యక్రమంలో సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి పాల్గొనగా, సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు సభకు అధ్యక్షత వహించారు.ఒంగోలు, కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *