తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, హైవేలు, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలు, సరైన పత్రాలు లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ మరియు ఇతర అవసరమైన పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.అదేవిధంగా హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు చోరీ వాహనాలు, నేర కార్యకలాపాల్లో ఉపయోగించే వాహనాలను గుర్తించడం కూడా ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమాచారమివ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పోలీసులు పేర్కొన్నారు.