తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-
ఈ లక్ష్యం చేరుకోవాలి అంటే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, సంస్థలు క్షేత్రస్థాయి వరకు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రకాశం నెల్లూరు మార్కాపురం జిల్లా ల హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన సమీకృత వ్యూహం (దిశా ) క్లస్టర్ ప్రివెన్షన్ మేనేజర్ ఎస్కే అమీన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్ర ఉమ్మడి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అదేసరాం గురువారం హెల్ప్ పి యు మేదరమెట్ల ప్రధాన కార్యాలయంలో అద్దంకి నాగులప్పలపాడు కొరిశపాడు మార్టూరు మండలాల ఔట్రిచ్ వర్కర్లకు, పి ఈ లకు హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు చేపడుతున్న కార్యక్రమాలపై హెల్ప్ పి యు మేదరమెట్ల ప్రాజెక్ట్ డైరెక్ట్ బి వి సాగర్ అధ్యక్షతనసమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది క్లస్టర్ ప్రెవేనిష్ మేనేజర్ ఎస్ కే అమీన్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకీ జిల్లాలో పెరుగుతున్నారని వ్యాధిగ్రస్తులను గుర్తించడంలో ప్రివెన్షన్ యూనిట్లో పనిచేసే పీర్ ఎడ్యుకేటర్స్ క్రియాశీలకమైన పాత్రని మీరు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి సంక్రమించిన కొద్ది రోజులు వారిని గుర్తించినట్లయితే వారికి అన్ని వైద్య పరీక్షలు చేసి వారికి ప్రభుత్వం ద్వారా ఏఆర్టి సెంటర్ ద్వారా మందులు వాడకం ప్రారంభించడం జరుగుతుందని తద్వారా వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, తద్వారా మీరు ఒక ప్రాణం కాపాడిన వారు అవుతారని పేర్కొన్నారు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎన్ వి ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ కొత్తగా సెక్స్ వృత్తి లోకి వచ్చే వారిని గుర్తించాలని వారికి సుఖ వ్యాధులు వ్యాప్తి చెందకుండా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా కండోమ్ వినియోగంపై వారికి అవగాహన కలిగించాల్సిన, అంతేకాకుండా వారితో సెక్స్ పాల్గొంటాకు వచ్చేటటువంటి వారిని కూడా గుర్తించి వారికి కూడా వారికీ కూడా వైద్య పరీక్షలు చేపించాలి అని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది యువతకు ఎక్కువగా సంక్రమిస్తుందని దీనికి ప్రధాన కారణం మాదకద్రవ్యాలకు బానిసలై విచ్చలవిడి శృంగారంలో పాల్గొనడం జరుగుతుందని ఎప్పటికప్పుడు సిబ్బంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ నియంత్రణ సంస్థ వారు జిల్లాల వైద్యాధిక శాఖ వారు దిశా వారు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూల కొరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోటంలో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని, ఇది ఒక ఉద్యోగం లాగా కాకుండా ఒక సామాజిక సేవ గా భావించి పనిచేయాలి అని సెక్స్ వర్కర్ పిల్లలు విద్యా వైద్యం ప్రభుత్వ పథకాలుచేరువ ఆయె విధం గా చూడాలి అని పేర్కొన్నారు బాపట్ల, పల్నాడు, ప్రకాశం మార్కాపురం, జిల్లాల హెచ్ ఐ వి &ఏయిడ్స్ నిర్మూలన,నియంత్రణ సమీకృత వ్యూహం (దిషా ) క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడుతున్న విధంగా చూడాలని వారికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, ట్రాన్స్ జెండర్స్ మీ ప్రాంతంలో గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరువయ్య విధంగా, మరియు వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించి వాళ్లు ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి గురైనట్లుగా తెలిస్తే వారికి వారికి వైద్య సేవలు అందించడంలో సిబ్బంది తగు సూచన సలహాలు వారు చేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచాలని, హెచ్ఐవి ఎయిడ్స్ జాతీయ టోల్ ఫ్రీ 1097 పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని, హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమాలు నిరంతర క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎన్విఎస్ రామ్మోహన్ హెల్ప్ పి.యు ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. వి సాగర్, ప్రోగ్రాం మేనేజర్ బి దుర్గ సురేంద్ర, ఎం. ఈ. ఏ, పి. మహేష్ ఔట్రిచ్ వర్కర్లు వి మల్లేశ్వరి ఆర్ కృష్ణవేణి, టి దుర్గా భవాని, ఎం మల్లేశ్వరి, ఎస్ కే ఫామిత, టి శ్రావణి వివిధ మండలాల పి. ఈ పాల్గొన్నారు…..