తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
నేరాల నివారణ, బంగారు దుకాణాల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు బంగారు దుకాణ యజమానులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బంగారు దుకాణాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. దుకాణ పరిసరాలు, ప్రవేశ ద్వారాలు, నగదు లావాదేవీలు జరిగే ప్రాంతాలు స్పష్టంగా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, భద్రతా అలారాలు, సరైన లాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన ఆభరణాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.వ్యాపార వర్గాల సహకారంతోనే ఆస్తి నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.