తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జాతీయడెంగ్యూ దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతలు డెంగ్యూ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. తదనంతరం సంయుక్తంగా జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కార్యక్రమము ఆర్డిఓ ఆఫీసు నుండి కోర్టు సెంటర్ కూడలి వరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిచాలని, డెంగ్యూ కారక దోమ చాలా ప్రమాదకరమని, ప్రాణాంతకమని తెలియజేశారు. అనంతరం కోర్టు సెంటర్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి ర్యాలీలో పాల్గొన్న వారితో డెంగ్యూ నివారణలో భాగస్వాములౌతామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యమని మనమందరం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలను నిర్మూలించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చునని తెలియజేశారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలలో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ B.మనస్సే మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి అనేది ఏడిస్ ఈజిప్ట్ దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని, దోమలు పెరగకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్రైడే ఫ్రైడే పాటించాలని తెలియజేశారు.డెంగ్యూ వ్యాధి లక్షణాలైన తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వంటిమీద దద్దుర్లు, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు, కంటి వెనక భాగంలో నొప్పి,రక్త కణాలు తగ్గిపోవడం వంటి లక్షణాలను అశ్రద్ధ చేయకుండా సకాలంలో సరైన చికిత్స చేయించుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె.రాహుల్ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ శ్రీ శివరామిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట రెడ్డి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిని డాక్టర్ ఏ సృజన, వైద్యాధికారిని డాక్టర్ అనూష, అసిస్టెంట్ మలేరియా అధికారి సీనయ్య, మార్కాపురం సబ్ యూనిట్ అధికారి R.నాగేంద్ర రెడ్డి, దోర్నాల అధికారి కే ఇశ్రాయేలు, Mpheo B. శ్రీకాంత్, మహిళ ఆరోగ్య పర్యవేక్షకులు M.సాయి గీత, B. రూత్ మేరీ, K. M. విజయలక్ష్మి కుమారి మరియు మార్కాపురం పట్టణము మరియు రూరల్ లో పనిచేస్తున్న మగ ఆరోగ్య కార్యకర్తలు మరియు ANMలు, ఆషా కార్యకర్తలు మరియు టీబీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.