తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పొదిలి–మర్రిపూడి రోడ్డులో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతంలో పెరిగిన పొదలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదలు వాహనదారుల దృష్టికి ఆటంకం కలిగించి ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా శుభ్రత కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది స్వయంగా పాల్గొని రహదారి పక్కన ఉన్న పొదలను తొలగించి వాహనదారులకు స్పష్టమైన విజిబిలిటీ కల్పించారు. రహదారిపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగ నియంత్రణతో వాహనాలు నడపాలని, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.