తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
స్వచ్ఛంద సంస్థలు అందరం సమిష్టి కృషితో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూల నిర్మూలన కొరకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పట్ల, ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా లెప్రసీ టి . బి మరియు ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి.బాలాజీ పేర్కొన్నారు ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం ( దిష )స్వచ్ఛంద సంస్థలు, ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఒంగోలు ప్రకాశం భవనం నుండి స్థానిక చర్చి సెంటర్ వరకు గత కొన్ని సంవత్సరాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ మరణించిన వారికి ఆత్మ శాంతి కలిగించాలని వారి కుటుంబ సభ్యులకు మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని వాళ్లు ఆత్మస్థైర్యం కలిగిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి హెచ్ఐవి ఎయిడ్స్ మరణించిన వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ముందుగా జిల్లా లెప్రసీ టీ.బి మరియు ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి.బాలాజీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ జి.బాలాజీ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ వ్యాధి ఎలా సోకుతుంది వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంశాల పైన క్షేత్రస్థాయి వరకు కళాశాలలో, గ్రామాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని , అంతేకాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో మరణించిన కుటుంబాలుకు అన్ని విధాల అండదండలుగా ఉండి వారు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చూడవలసిన బాధ్యత ఉందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత వీడనాడాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వ్యాధి ప్రభావం కంటే సమాజంలో వారి పట్ల చూపించిన వివక్షత వల్లే మానసిక ధైర్యాన్ని కోల్పోయి, సమాజంలో మరియు కుటుంబ సభ్యులుచూపించే వివక్షతను భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం, మానసిక ఆందోళన గురై అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఎవరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపించకూడదని హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని ఎఆర్టి సెంటర్ ద్వారా మందులు తీసుకుని వాడుకోవడం ద్వారా వారి జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నారు ఒంగోలు ఏ. ఆర్ టి సెంటర్ మెడికల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోసప్ శామ్యూల్ మాట్లాడుతూ హెచ్ఐవి, సిఫిలిస్, హైపటైటిస్.బి పూర్తిస్థాయిలో నిర్మూలించేంతవరకు ఒకే లక్ష్యంతో మనమందరం పనిచేయాలని తల్లి మరియు బిడ్డ రక్షించి వ్యాధులు లేని సమాజాన్ని నిర్మించుటముకొరకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని ట్రాన్స్ జెండర్స్, సెక్స్ వర్కర్స్ పట్ల వివక్షత విడనాడాలని వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేవిధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూహెచ్ఐవి ఎయిడ్స్ జాతీయ టోల్ ఫ్రీ 1097పై హెచ్ ఐ వి ఎయిడ్స్ నియంత్రణ చట్టం 2017 పైన హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కొరకు ప్రభుత్వ ద్వారా అందేటటువంటి ఐ సి టి సి సెంటర్స్ మరియు ప్రభుత్వ అందించే ఉచిత వైద్య సేవలు గురించి అందరికీ అవగాహన కలిగించాల్సిన బాధ్యతుందని పేర్కొన్నారు ర్యాలీ తదనంతరం ప్రతిజ్ఞ నిర్వహించటం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్పాజిటివ్ నెట్ వర్క్ పీపుల్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నరేంద్ర ప్రకాశం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సిబంది, సి. ఎస్. వో ఎస్ సాయి, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, గ్రో స్వచ్ఛంద సంస్థ సినార్డ్,ప్రోగ్రాం మేనేజర్లు బి దుర్గ సురేంద్ర, ఎస్కే పీర్ భాష, వెంకటేశ్వర్లులింక్ వర్కర్స్ జిల్లా రిసోర్స్ జి.పర్సన్ స్వరూప్ కుమార్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ గ్రో స్వచ్ఛంద సంస్థ డ్యాప్క్ వు లిడ్ సిబంది ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థులు ఏ. ఆర్ టి, ఐ సి టి సి సిబంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు….