తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:-
కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా Dr. లక్ష్మీ గారు మాట్లాడుతూ… “రాధా అన్న నాకు కుటుంబ సభ్యుల్లాంటి వారు. కష్టకాలంలో అండగా నిలబడ్డ వారి అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను” అని పేర్కొన్నారు.శ్రీకృష్ణదేవరాయలు గారు, వంగవీటి రంగా గారి ఆశయాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకం” అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. దర్శి ప్రాంత అభివృద్ధి కోసం నేను మీ సేవకురాలిగా నిరంతరం పనిచేస్తాను” అని హామీ ఇచ్చారు.ముఖ్యంగా బోధనంపాడు గ్రామ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.