అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో జూద స్థావరంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.24,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు కుటుంబాలు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రజల్లో నేరాలను అరికట్టడం, శాంతియుత వాతావరణం కొనసాగించడమే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు తమ ప్రాంతాల్లో జూదం, మద్యం అక్రమ విక్రయాలు లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *