తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీ పరిధిలోని అలగాయపాలెం గ్రామంలో జరిగిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సముద్రంపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడమే మన ప్రభుత్వ లక్ష్యం.
మంగళవారం అందించిన లబ్ధి వివరాలు – కందుకూరు నియోజకవర్గం మొత్తం 2,482 మత్స్యకార కుటుంబాలకు ₹4,96,40,000/- ఆర్థిక సాయం.కరేడు పంచాయతీ పరిధిలో 1,053 కుటుంబాలకు ₹2,10,60,000/- నేరుగా అందజేయడం జరిగింది. మత్స్యకారుల కష్టాల్లో పాలుపంచుకుంటూ, వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.