చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నేరస్థులను గుర్తించి పట్టుకోవడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కీలక కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.నేరాల నివారణలో భాగంగా పోలీసులు అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా ఉంచుతూ, అవసరమైతే వ్యక్తులను విచారించి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ముందుగానే అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకు గస్తీ చర్యలను మరింత బలోపేతం చేశారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానాలు విధిస్తూ, వారి ప్రాణ భద్రత కోసం హెల్మెట్ వినియోగం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని ప్రకాశం జిల్లా పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *