కనిగిరిలో బుధవారం AL-HAQ FRIENDS WELFARE SOCIETY ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షికోత్సవ వేడుకల్లో సింగరాయకొండకు చెందిన సామాజిక సేవకుడు షేక్ నాయబ్ రసూల్ కు “The Best Humanity Guest of Honour – 2026” అవార్డు ప్రదానం చేశారు.సమాజ సేవలో కృషి చేస్తున్నందుకు గాను ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నాయబ్ రసూల్ మాట్లాడుతూ, ఈ గౌరవం తన ఒక్కరికే కాకుండా తనకు అండగా నిలిచిన దాతలు, మిత్రులు, ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు.ముస్లిం సేవక్ కమిటీ, సింగరాయకొండ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం గత ఏడాది కాలంగా నిరంతరాయంగా కొనసాగుతూ ఇప్పటికే 50 సార్లు విజయవంతంగా పూర్తయింది. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా చేయూత అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సమాజంలోని నిరుపేదలు, అవసరమైన వారికి అండగా నిలుస్తూ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *