తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల నివారణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు, డార్మిటరీస్‌పై ప్రకాశం జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి, బస చేసిన ప్రయాణికుల ఆధార్ వివరాలు, రిజిస్టర్ నమోదు, గుర్తింపు పత్రాల ధృవీకరణ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నించి అవసరమైన వివరాలు సేకరించారు.లాడ్జి, డార్మిటరీ యజమానులకు ప్రతి కస్టమర్ పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయడం, ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా భద్రపరచడం, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతోనే సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు.