సింగరాయకొండ మండల కేంద్రంలో క్లస్టర్ 9 & 10 పరిధిలో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు 2వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య, APUFIDC డైరెక్టర్ & కొండపి నియోజకవర్గ అబ్జర్వర్ డా. పారి చందన స్రవంతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కీ.శే. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ మరియు దామచర్ల ఆంజనేయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *