బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలోని ఈద్గా, మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్గా, మసీదులకు తరలిరానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రార్థనా ప్రదేశాల వద్ద శాంతిభద్రతలు భంగం కలగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టి, ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.అదేవిధంగా ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలతో కీలక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *