తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ గారు ప్రజాసేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న మహానేత అన్నారు. ఎన్టీఆర్ గారు కళారంగంలో తన అద్భుతమైన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన పాత్రలు న్యాయం, ధర్మం, పరోపకారం వంటి విలువలను ప్రజల హృదయాల్లో నాటే విధంగా ఉండటం విశేషమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ గారని, భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆయన అందించిన సేవలు అపూర్వమైనవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.