తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
కురిచేడు మండలం, క్లస్టర్ – 3 మహానాడు వేదికగా మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు తీర్మానాలను ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు,టిడిపి యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్ గారు,నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర గారు,దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు
దర్శి మహానాడు వేదిక వద్ద దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన 19 తీర్మానాలను దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ ప్రవేశపెట్టగా, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు గారు కురిచేడు క్లస్టర్ – 3 వేదికగా ఆమోదించారు. ఈ తీర్మానాలకు డిజిటల్ మహానాడు పరిధిలోని 10 క్లస్టర్ల వేదికలు మద్దతు తెలిపాయి.
దర్శి నియోజకవర్గం తరఫున ఆమోదించిన ప్రధాన తీర్మానాలు :
▪️ దొనకొండను ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలి
▪️ ఉద్యానవన పంటలకు ప్రత్యేక సబ్సిడీలు కల్పించాలి
▪️ దర్శిలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
▪️ తాళ్లూరు, ముండ్లమూరు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి
▪️ దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
▪️ దర్శిని థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
▪️ పంట పొలాల్లో వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా అవగాహన కల్పించాలి
▪️ బీఈడీ కాలేజీల్లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
▪️ దర్శి నియోజకవర్గానికి రెండో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి
▪️ దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు
▪️ దర్శికి రైలు మార్గం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు
▪️ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు కి కృతజ్ఞతలు
▪️ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
▪️ 22A భూముల రైతులకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి
▪️ దర్శి డివిజన్‌లో రెండో పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేయాలి
▪️ వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి
▪️ ఎత్తిపోతల పథకాల పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి
▪️ దర్శిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
▪️ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.