తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
డిజిటల్ మహానాడు వేడుకల్లో భాగంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర గారు, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా Dr. లక్ష్మీ మాట్లాడుతూ…
“డిజిటల్ మహానాడుకు టిడిపి కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి చూపించిన నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసమే రాబోయే రోజుల్లో పార్టీ విజయాలకు బలమైన నిదర్శనం. మనందరి సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సేవలో ముందంజలో నిలుద్దాం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను, క్లస్టర్ ఇంచార్జ్ సుంకర రాఘవ రెడ్డి, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మస్తాన్ రావు, గ్రామ టిడిపి నాయకులు, యూనిట్ & బూత్ ఇంచార్జిలు, KSS కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.