తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :-
తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ ‘మహానాడు’ రెండో రోజు వేడుకల్లో భాగంగా ఈరోజు గుడ్లూరు మండలంలో పర్యటించాను. క్లస్టర్ 8 (గుండా ఆదిశేషయ్య, వరలక్ష్మమ్మ కళ్యాణ మండపం) మరియు క్లస్టర్ 9 (గొల్ల కంటయ్య, లక్ష్మమ్మ గార్ల కళ్యాణ మండపం)లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచాను. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించాను. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అన్నగారి ఆశయాలను స్కరించుచున్నాము…ఈ మహానాడు స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చాను.