తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
ఉలవపాడులోని భోగినేని చెంచు రామానాయుడు కళ్యాణమండపంలో నిర్వహించిన ‘హైబ్రిడ్ మహానాడు’ రెండో రోజు కార్యక్రమంలో గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.ఈ సందర్భంగా తెలుగుజాతి కీర్తిని దశదిశలా చాటిన మహానాయకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము. అనంతరం క్లస్టర్ 10, 11, 12 పరిధిలోని ఉలవపాడు నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మహానాడు ప్రసంగాలను వీక్షించడం జరిగింది.ఎన్టీఆర్ గారు వేసిన పునాదులు, చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం.