తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
రాచర్ల మండల పరిధిలోని ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రాచర్ల పోలీస్ శాఖ మరియునెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు సంయుక్తంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రాచర్ల క్రాస్ రోడ్ల వద్ద ఉన్న టర్నింగ్ (మలుపు)వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు.
ఈప్రమాదాల నివారణకు తక్షణ చర్యల్లో భాగంగా, నెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు ప్రత్యేకంగా సైడ్ మిర్రర్స్ (రౌండ్ కాన్వెక్స్ మిర్రర్స్) ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.ఎస్ఐ కి సైడ్ మిర్రర్స్ అందజేత.ఈమలుపు వద్ద వాహనదారులకు ఇరువైపులా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసేందుకు, నెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు , ఈ సైడ్ మిర్రర్స్‌ను రాచర్ల ఎస్సై పి. కోటేశ్వరరావు కి అధికారికంగా అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.పి. కోటేశ్వరరావు (రాచర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ – SI)నెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు.
కొప్పుల వెంకటేశ్వర్లు (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ – ASI)మరియు రాచర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ… ప్రమాదాల నివారణకు నెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు గారు స్పందించి సైడ్ మిర్రర్స్ అందజేయడం అభినందనీయమన్నారు._ ఈమిర్రర్స్ వల్ల మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు ముందుగానే కనిపిస్తాయని, దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నారు.సకాలంలో స్పందించి ప్రయాణికుల ప్రాణాల రక్షణకు తోడ్పడిన నెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు ,ని, పోలీస్ సిబ్బందిని స్థానిక ప్రజలు మరియు వాహనదారులు ఎంతగానో అభినందిస్తున్నారు…..