తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్లు లోని చెమిడిపాడు పంచాయతీలో వేసవి సెలవులు కిషోరీ వికాస కార్యక్రమాన్ని ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన బాలబాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యత కెరియర్ మార్గదర్శకత్వం మరియు నైపుణ్యాభివృద్ధిల గురించి తెలియజేయడమైనది వ్యక్తిగత మరియు సామాజిక ఎదుగుదలకు విద్య ప్రాథమిక మైనది ఇది సామాజిక మరియు ఆర్థిక అసమానతలు తగ్గించటం ద్వారా విమర్శనాత్మకంగా ఆలోచించడానికి ప్రశ్నించడానికి మరియు ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వారికి శక్తినిచ్చే జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలతో వ్యక్తులను సన్నిద్ధం చేస్తుంది విద్య స్థిరమైన మరియు సంతోషకరమైన జీవితానికి దోహదపడుతుంది ఆర్థిక స్వాతంత్రం అందిస్తుంది సమానత్వాన్ని పెంపొందిస్తుంది మరియు స్వాలంబన ప్రోత్సహిస్తుంది . ఇది తప్పు ఒప్పులు అవగాహన పెంచుతుంది చట్ట విరుద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని తగ్గిస్తుంది మరియు దేశము యొక్క ఆర్థిక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది అని వారికి తెలియజేయడమైనది ఇంకా ప్రపంచంలోని అతిపెద్ద విద్యా వ్యవస్థలో ఒకటైన భారత దేశ విద్యా వ్యవస్థ 10+2 పద్ధతిని అనుసరిస్తుంది విద్యాసంస్థలతో నమోదయ్యే వారి సంఖ్యలో గణనీయమైన మెరుగుదలలు ఉన్నప్పటికీ బడి మానేసే వారి సంఖ్యను తగ్గించుకుంటూ ప్రతి బాల బాలికలు విద్యను అభ్యసించాలని అని వారికి తెలియజేయడమైనది ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వారికి తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి చెమిడిదిపాడు సచివాలయం పంచాయతీ సెక్రెటరీ కే చిన్నయ్య వీఆర్వో ప్రసాదు వెల్ఫేర్ అసిస్టెంట్ సుజాత ఏఎన్ఎం నిర్మల ఎమ్మెల్యే హెచ్ పి అనూష ఆశా వర్కర్లు జయలక్ష్మి ఆదిలక్ష్మి అంగన్వాడి ఆయాలు జయలక్ష్మి రీబాక హాజరైనారు