చలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు సహకారం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ మోసాలు, పోక్సో చట్టం (POCSO Act), ఎన్డీపీఎస్ చట్టం (NDPS Act), ఆస్తి నేరాల నివారణ, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, మహిళలపై నేరాల నిరోధం, హెల్మెట్ వినియోగం మరియు రోడ్డు భద్రత అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతుల గురించి ప్రజలకు వివరించి, OTPలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. పిల్లలు మరియు మహిళల రక్షణ కోసం పోక్సో చట్టంలోని ముఖ్యాంశాలను వివరించి, వేధింపులపై వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరిస్తూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఆస్తి నేరాల నివారణ కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న పోలీసు సేవలు, అత్యవసర సహాయ నంబర్ల గురించి వివరించారు.
