తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :-
గుడ్లూరు మండలం లోని పూరేటిపల్లికి చెందిన నవమణికి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మార్కాపురం రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు శుక్రవారం రూ 2లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. దారకానిపాడు ఏపీజిబి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమాపథకం ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు ఇందులో భాగంగా నవమణి భర్త పరిశుద్ధ రావుబ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నట్లు తెలిపారు. దీనితో ఆయన ఈ పథకం కింద ఏడాదికి రూ.436లు ప్రీమియమును చెల్లిస్తున్నట్లు చెప్పారు. దురదృష్టవశాత్తు గుండెపోటుతో ఆయన మృతి చెందడంతో ఆయన భార్య నవమణికి ఈ మొత్తము అందజేసినట్లు వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు
మేనేజర్ హరికృష్ణ ప్రసాద్, రీజనల్ కార్యాలయం సీనియర్ మేనేజర్ వి. భువనేశ్వ ర్ పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.