వారి కుమారులు శ్రీ గాదె మధుసూదన్ రెడ్డి గారిని ఫోన్ లో పరామర్శించిన్నారు. ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు, న్యాయవాదులు మరియు మాజీ మంత్రివర్యులు, శ్రీ గాదె వెంకట రెడ్డి గారి మరణ వార్త నాకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించినది. మాకు మా కుటుంబానికి వారు అంత్యంత ఆప్తులు అని తెలియజేసినారు. శ్రీ గాదె వెంకట రెడ్డి గారు ప్రజా నేతగా ప్రకాశం జిల్లా పేద ప్రజలకు ముఖ్యంగా ఇంకొల్లు – పర్చూరు ప్రాంత పేద ప్రజలకు పెక్కు సేవలు అందించి ఆ ప్రాంత ప్రజల మన్ననలను పొందారు.మంచితనానికి – సేవాతత్పరతకు ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయన లేని లోటు జిల్లా ప్రజానీకానికి ముఖ్యంగా పర్చూరు నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేయుచున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *