ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 24 మంది జూదరులను పట్టుకొని రూ.87,620 నగదు స్వాధీనం చేసుకున్నారు.మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని చీమట గ్రామంలో ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో జూదానికి పాల్పడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.16,770 నగదును స్వాధీనం చేసుకున్నారు.అదే విధంగా కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోపాడు చెరువు వద్ద నిర్వహించిన మరో దాడిలో 10 మంది జూదరులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.70,850 నగదు స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాలు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఎక్కడైనా జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *