తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవికాలం ఆరంభం నుండి వేసవికాలం ముగిసే వరకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని అలాగే దాతల సహకారంతో వారానికి మూడు నుండి నాలుగు రోజులపాటు మధ్యాహ్నం వేళ్ళలో కొందరికైనా వేసవి తాపన్ని తగ్గించి కొంత దాహార్తిని అయినా తీర్చాలన్న సంకల్పంతో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా శుక్రవారం గుడ్లూరు మండలం పెదలాటవరిపి గ్రామ వాస్తవ్యులు ఏల్చూరి ప్రసాద్ రావు ధర్మపత్ని సురేఖ గార్ల 15 వ వివాహ వార్షికోత్సవo మరియు శ్రీమతి సురేఖ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు బస్టాండ్ సెంటర్లో చల్లని మజ్జిగ మరియు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేత్రపురి శ్రీరామ సేవక్ నిర్వాహకులలో ఒకరైనటువని ఎయిర్టెల్ చిన్న మాట్లాడుతూ ఏల్చురి ప్రసాద్ గారు స్వతహాగా కష్టజీవి తాను ఒక గూడ్స్ ఆటో కార్మికుడిగా నిత్యం కష్టపడుతూ ఉంటాడు అలా తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో శుక్రవారం వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా తన కుటుంబం మాత్రమే సంతోష పడకూడదని తాను పొందే సంతోషంలో కొంతైనా నలుగురికి పంచాలన్న ఉన్నతమైన ఆలోచనతో మంచి మనసుతో సేవా దృక్పథంతో చల్లని మజ్జిగ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. ప్రసాద్ గారు మీ మంచితనానికి మా ధన్యవాదాలు అలాగే మా నేత్రపురి శ్రీరామసేవక్ తరఫునుంచి ప్రసాద్ గారు సురేఖ గారు మీ దంపతులిద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగే సురేఖ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు, ప్రసాద్ గారు లాగా అందరూ సేవా తత్వాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు. ఇప్పటివరకు మా ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాతోపాటు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా నేత్రపురి శ్రీరామసేవక్ సభ్యులకు మా ఆర్యవైశ్య మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో నేత్రపురి శ్రీరామ సేవక్ సభ్యులు, ఆర్యవైశ్య మిత్రులు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.
