తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో ఈనెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.తనతో పాటు జిల్లా స్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఒక ప్రకటనలో కలెక్టర్ కోరారు.