తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్.టి. రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు,ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి , ఒంగోలు మరియు సంతనూతలపాడు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు , శ్రీ బి.ఎన్. విజయకుమార్ కలసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు గారు విలేకరులతో మాట్లాడుతూ, తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎన్.టి. రామారావు గారి జయంతి వేడుకలను అధికారికంగా జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ పర్సన్ ఇంచార్జి డా. కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచరిత్ర , ఒంగోలు మార్కెటింగ్ చైర్మన్ శ్రీ వెంకటరావు , మాజీ నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు ఆర్డిఓ శ్రీ చంద్రశేఖర్ నాయుడు , మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట కృష్ణయ్య, స్టెప్ సిఈఓ శ్రీ శ్రీమన్నారాయణ , పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.