తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీసు వద్ద సిఐటియు జెండాను సిఐటియు మాజీ నాయకులు ప్రాథమిక వైద్య నిపుణులు ఎస్ కే కరీమ్ ఆవిష్కరించారు.
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్.ఎం రమేష్ పాల్గొని మాట్లాడుతూ సీఐటీయూ విశిష్టతను వివరించారు. 1970లో కలకత్తా నగరంలో ఐక్యతా, పోరాటం నినాదంతో సిఐటియు ఏర్పడిందని తెలిపారు. సిఐటియు ఏర్పడిన తర్వాత కార్మికులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ 14 సమ్మెలు చేసిందని తెలిపారు. కార్మికులకు అనేక హక్కులు పోరాడి సాధించామని పేర్కొన్నారు. నేడు కార్మికులకు ఉన్న హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. అందుకే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను హరించేందుకు పూనుకున్నారని తెలిపారు. కనీస వేతనాలు అమలు కోసం, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజేషన్ కోసం, అసంఘటితరంగా కార్మికుల సమగ్ర చట్టం కోసం సిఐటియు కృషి చేస్తుందని తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో తాము చేస్తున్న పోరాటాలకు కార్మిక వర్గం క్రింది స్థాయిలో కలిసి రావాలని, సంఘటితం కావాలని, తద్వారానే ఉన్న హక్కులను కాపాడుకోవడం, ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు కోసం, కార్మికులకు మరిన్ని రాయితీలు వస్తాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ మాట్లాడుతూ ఉలవపాడు మండలంలో సిఐటియు ఒక శక్తిగా ఎదుగుతుందని, సిఐటియు బలపడడం ద్వారానే కార్మికుల హక్కులు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఏ. సత్యనారాయణ, ఎస్. డి జహీర్, ఎస్. డి గౌస్ భాషా, ఏపీ ఫీల్డ్ అసిస్టెంట్లు అసోసియేషన్ మండల కార్యదర్శి రమణయ్య వీఆర్ఏ సంఘం మండల కార్యదర్శి చిరుతోటి శ్రీను, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నాయకులుఆర్. సునీత, జయమ్మ, నాయకులు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దువ్వూరి జాన్, ఏలూరి.నాగార్జున,జువ్విగుంట వెంకటేశ్వర్లు, దాసరి. నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.