ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించి వారికి ఈ-చలాన్లు విధించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని పోలీసులు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, తన భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడేలా సహకరించాలని ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *