కలిగిరి లోని జడ్పీ హైస్కూల్లో పిఎన్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతలైన వారికి బహుమతులు ఇచ్చేందుకు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, కలిగిరి టిడిపి మండల కన్వీనర్ పూసల వెంగప నాయుడు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధమూర్తి మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నేటి మాట్లాడుతూ కలిగిరి పట్టణంతో నాకు ఎనలేని సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గత 2024 ఎన్నికల్లో బిజెపి, జనసేన నాయకుల కోఆర్డినేషన్ బాధ్యతలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అప్పగించడం జరిగిందనీ కలిగిరి పాతూరు ప్రజలు భారీ మెజార్టీని ఇవ్వడం జరిగిందని అఖండ మెజారిటీని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కలిగిరి అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ నిర్వహించిన బండారు లక్ష్మీనారాయణ, బండారు మధు, బండారు మనోహర్, కొండపల్లి విజయ్ కుమార్ లను ఆయన అభినందించారు, ఈ టోర్నమెంట్లో మొదటి స్థానంలో నిలిచిన భాయ్ టీమ్ , రెండవ స్థానంలో నిలిచిన మహా లక్ష్మమ్మ సీనియర్ టీంకు, మూడో స్థానంలో నిలిచిన బండారు 11 టీంకు ఆయన బహుమతులను అందజేశారు. యువత క్రీడల పై ఆసక్తిని అలవర్చుకోవాలని తెలిపారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *