తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలనే, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ పి. బాలమురళికృష్ణ గారి పర్యవేక్షణలో అద్దంకి టౌన్ లోని ఎన్టీఆర్ కాలనీలో మరియు పరిసర ప్రాంతంలో విస్తృత స్థాయిలో ఆపరేషన్ వజ్రా ప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు , సంతమాగులూరు సిఐ శేషగిరీరావు, కొరిశపాడు ఎస్సై సురేష్ , జె. పంగులూరు ఎస్సై వినోద్ కుమార్ , సంతమాగులూరు ఎస్ఐ పట్టాభిరామయ్య, మరియు సిబ్బంది 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితుల తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఆపరేషన్ లో భాగంగా 99 ద్విచక్ర వాహనాలు, ఒక కారు మరియు మూడు ఆటోలు చెక్ చేసి వాటిలో పత్రాలు లేని వాహనాలు 19 వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు , సంతమాగులూరు సిఐ శేషగిరీరావు గార్లు మాట్లాడుతూ ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు బానిస అయితే వ్యక్తి ఆర్థికంగా, కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన అనేక అనర్థాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఐ.పి.ఎల్. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే క్రికెట్ ఆన్‌లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్‌లలో పాల్గొని లక్షల రూపాయలు కోల్పోయిన వారు ఉన్నారని, యువత వీటి నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పమని మోసపూరితంగా డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.
