సమయంలో మార్పు చేసినట్లు వెల్లడించిన కలెక్టర్ ఎం. విజయ సునీత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం (జూన్ 1) నిర్వహించబోయే ఈ కార్యక్రమ సమయాన్ని మార్చినట్లు ఆమె పేర్కొన్నారు.సాధారణంగా జరిగే సమయం కాకుండా, సోమవారం ఉదయం 10:00 గంటల నుంచే ఈ వేదిక ప్రారంభమై, మధ్యాహ్నం 1:00 గంట వరకు కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ సమయ మార్పును గమనించాలని ఆమె కోరారు.జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అర్జీల రూపంలో రాసుకుని వచ్చి అందజేయాలని కలెక్టర్ సూచించారు…